CBI investigation in YS Viveka murder case : వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యేకంగా ఏర్పాటైన సీబీఐ నూతన దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఆదివారం ఉదయం కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆయన నివాసంలో అరెస్టు చేసిన అధికారులు.. ఆ వెంటనే హైదరాబాద్ తరలించి కోర్టులో హాజరుపరిచారు. 14రోజుల రిమాండ్ విధించగా.. 10రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుండగా.. తాజాగా భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి సైతం సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయానికి రావాలని తెలిపింది. గతంలోనే ఆయన్ను నాలుగు సార్లు విచారించిన సీబీఐ.. మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కేసులో నిందితులైన గజ్జెల ఉదయ్ శంకర్ రెడ్డి కస్టడీ పిటిషన్, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
భాస్కర్ రెడ్డి, గజ్జెల ఉదయ్ శంకర్ రెడ్డిలపై కస్టడీ పిటిషన్... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. భాస్కర్‌రెడ్డిని ఆదివారం అరెస్టు చేసిన సీబీఐ... ఆ తర్వాత ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించిన అధికారులు.. కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. హత్య వెనక భారీ కుట్రను చేధించడం కోసం భాస్కర్‌రెడ్డిని అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో దర్యాప్తు సంస్థ తెలిపింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న భాస్కర్‌రెడ్డిని పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. సీబీఐ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని భాస్కర్‌రెడ్డికి న్యాయస్థానం తెలిపింది.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ.. మరో నిందితుడు గజ్జెల ఉదయ్ శంకర్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై కూడా సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. దర్యాప్తు కొనసాగించడానికి.. హత్య వెనక కుట్రను బయట పెట్టేందుకు ఉదయ్ శంకర్‌రెడ్డి కస్టడీ అవసరమని పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. మరో నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో ఏపీ పోలీసుల సిట్ 90రోజుల్లో చార్జ్‌షీట్ వేయకపోవడంతో ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ మంజూరైంది. ఆ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోరుతోంది. దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై కూడా నేడు హైకోర్టులో విచారణ కొనసాగనుంది.
ఇవీ చదవండి :