ETV Bharat / bharat

సీఎం సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు.. ఆ ఆరోపణలతో! - సీబీఐ దాడులు

CBI Raids Ashok Gehlot brother: రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ సోదరుడి ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు నిర్వహించింది. ఓ ఫర్టిలైజర్​ స్కాంకు సంబంధించి ఆరోపణలతో సీబీఐ ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Rajasthan CM Ashok Gehlot
అశోక్​ గహ్లోత్​
author img

By

Published : Jun 17, 2022, 11:43 AM IST

Updated : Jun 17, 2022, 12:10 PM IST

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ సోదరుడు అగ్రసేన్​ గహ్లోత్​ ఇల్లు, వ్యాపార సముదాయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఓ ఫర్టిలైజర్​ కుంభకోణంపై తాజాగా కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. జోధ్​పుర్​లోని అగ్రసేన్​ గహ్లోత్​ నివాసానికి శుక్రవారం ఉదయం చేసుకున్న సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అగ్రసేన్​ ఒక ఫర్టిలైజర్​ వ్యాపారి. రాహుల్​ గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ నిరసనలు చేపట్టిన తరుణంలోనే అశోక్​ గహ్లోత్​ సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

యూపీఏ ప్రభుత్వ హయాంలో 2007 నుంచి 2009 వరకు పొటాష్​ను భారీగా విదేశాలకు తరలించినట్లు అగ్రసేన్​పై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎరువులు రైతులకు రాయితీపై ఇచ్చేవని, వాటిని అక్రమ మార్గంలో విదేశాలు ఎగుమతి చేసినట్లు సీబీఐ అధికారవర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న వారికి సంబంధించిన గుజరాత్​, రాజస్థాన్​, బంగాల్​లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇండియా పొటాష్​ లిమిటెడ్​కు అధికారిక డీలర్​గా వ్యవహరించిన అగ్రసేన్​ గహ్లోత్​ సహా ఇతరులపై అవినీతి కేసు నమోదు చేసిన అనంతరం ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. 2020లోనూ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అగ్రసేన్​ నివాసంలో తనిఖీలు నిర్వహించింది.

ప్రతీకార రాజకీయాలే: రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ సోదరుడు అగ్రసేన్​ గహ్లోత్​ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించటాన్న తప్పుపట్టింది కాంగ్రెస్​. ప్రతీకార రాజకీయంగా అభివర్ణించింది. అలాంటి చర్యలతో తమ గొంతును నొక్కలేరని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ అన్నారు​. మూడు రోజులుగా దిల్లీలో జరిగిన ఆందోళనల్లో అశోక్​ గహ్లోత్​ ముందు వరసలో ఉన్నారని, దానికి మోదీ ప్రభుత్వం ఈ విధంగా స్పందించిందని ఆరోపించారు.

ఇదీ చూడండి: ఆ అధికారులకు షాక్​.. 80 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు

'అగ్నిపథ్​'పై ఆగని నిరసనల హోరు.. పలు చోట్ల రైళ్లకు నిప్పు

Last Updated : Jun 17, 2022, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.