ETV Bharat / bharat

మంత్రిపై లైంగిక వేధింపుల కేసు.. బాధ్యతల నుంచి తప్పుకున్న మినిస్టర్​ - హరియాణా క్రీడా శాఖ మంత్రి కేసు

హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్​పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఫిర్యాదు చేశారు. కాగా, తన పరువు తీయడానికే ఇలా కుట్ర పన్నారంటూ మంత్రి ఈ ఆరోపణలను ఖండించారు. దర్యాప్తు జరిగేంత వరకు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

case filed against haryana sandeep singh

author img

By

Published : Jan 1, 2023, 1:48 PM IST

జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్​ను​ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్​ సింగ్​పై కేసు నమోదైంది. ఆ మహిళ కోచ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు ఐపీసీ సెక్షన్లు కింద సెక్టార్​ 26 పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, దర్యాప్తు పూర్తయ్యేంతవరకు.. క్రీడా శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నట్లు సందీప్​ సింగ్​​ తెలిపారు.

నా ఇమేజ్​ చెడగొట్టడానికే ఈ కుట్ర: సందీప్​ సింగ్
తనపై వస్తున్న ఆరోపణలు సందీప్​ సింగ్​ ఖండించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. తనపై వచ్చిన 'నిరాధార ఆరోపణల'పై.. పూర్తి దర్యాప్తు చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరారు. ఆ మహిళ కోచ్​ గతాన్ని కూడా పరిశీలించాలని అన్నారు.

ఇన్​స్టాగ్రామ్​లో అలా మెసేజ్ చేశారు..
సందీప్​ సింగ్​ తనను ఓ జిమ్​లో చూశారని.. ఆ తర్వాత ఇన్​స్టాగ్రామ్​ ద్వారా కాంటాక్ట్​ అయ్యారని మహిళా కోచ్​ ఆరోపించారు. ఓసారి ఆయన్ను కలవడానికి కార్యలయానికి వెళ్లినపుడు.. తనను వేధించారని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఆయన(సందీప్​ సింగ్​, మంత్రి) నన్ను కార్యాలయంలోని ఓ క్యాబిన్​లోకి తీసుకెళ్లారు. అనంతరం నా కాళ్లపై చేతులు వేశారు. నన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డానని చెప్పారు. నువ్వు నన్ను సంతోష పెడితే.. నేను నిన్ను సంతోషంగా ఉండేలా చూస్తానని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన చేయి తీసేసినప్పుడు.. నా టీషర్ట్​ చింపేశారు. నేను హెల్ప్​ చేయాలని ఎంత ఏడ్చినా.. ఆ ఆఫీస్​లో ఎవరూ పట్టించుకోలేదు" అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో పూర్తి దర్యాప్తు చేసి.. పోలీసులు తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు మహిళా కోచ్​ చెప్పారు.

ఈ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్​ సింగ్​ హుడా డిమాండ్​ చేశారు. సందీప్​ సింగ్​ను పదవి నుంచి తొలగించాలని.. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్​ఎల్​డీ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.