ETV Bharat / bharat

'దేశ ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి భరోసా ఇచ్చే సమావేశాలివి' - మోదీ వార్తలు

Budget session 2022 modi speech: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు.. దేశ ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. భారత్​కు అనేక అవకాశాలు పొంచి ఉన్నాయని చెప్పారు.

MODI PARLIAMENT
MODI PARLIAMENT
author img

By

Published : Jan 31, 2022, 11:01 AM IST

Budget session 2022 modi speech: ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ప్రపంచానికి భరోసా ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. టీకా పంపిణీ కార్యక్రమం, భారత్​లో తయారైన వ్యాక్సిన్ల గురించి ప్రపంచానికి చాటి చెబుతాయని ఉద్ఘాటించారు.

budget session 2022

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల మధ్య భారత్​కు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత సమావేశంలో రాజకీయ పార్టీలన్నీ నాణ్యమైన చర్చకు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

pm narendra modi news

"దేశ ఆర్థిక వృద్ధి, వ్యాక్సినేషన్ కార్యక్రమం, భారత్​లో తయారయ్యే టీకాలపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ బడ్జెట్ సమావేశాలు ఉపయోగపడతాయి. ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీలు నాణ్యమైన చర్చలు జరిగేలా చూస్తారని ఆశిస్తున్నా. ఎన్నికల ప్రభావం ఈ సమావేశాలపై, చర్చలపై ఉంటుందనేది నిజమే. ఎన్నికలు నడుస్తూనే ఉంటాయి. కానీ బడ్జెట్ అనేది ఏడాది మొత్తానికి మార్గనిర్దేశం అందిస్తుంది. ఈ సమావేశాలు ఎంత ఫలప్రదమైతే.. ఈ ఏడాది దేశం ఆర్థికంగా పురోగమించేందుకు అన్ని అవకాశాలు లభిస్తాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.