ETV Bharat / bharat

ముహుర్తం టైం దాటినా బరాత్​లో స్టెప్పులు.. వరుడ్ని చితకబాది, పెళ్లి క్యాన్సిల్!

Bridegroom Expelled From Wedding: పెళ్లి వేడుకల్లో బరాత్​ నిర్వహించడం ఆనవాయితీ. ఇది​ పెళ్లి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కానీ ఇక్కడ ఆ బరాతే పెళ్లిని రద్దు అవడానికి కారణమైంది. వధువు కుటుంబీకులు వరుడ్ని చితకబాది పెళ్లిమండపం నుంచి గెంటేశారు. ఇంతకీ ఏం జరిగింది?

marriage
పెళ్లి వేడుక
author img

By

Published : Apr 27, 2022, 4:09 PM IST

Bridegroom Expelled From Wedding: వివాహ వేడుక అంతా ఒక ప్లాన్​ ప్రకారం జరిపించాలని అనుకున్నారు ఆ పెళ్లిపెద్దలు. ఇందులో భాగంగా అనుకున్న ముహుర్తానికే వధూవరులకు వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ ఇందుకు బరాత్​ అడ్డమొచ్చింది. టైం అయిపోతున్నా పట్టించుకోకుండా పెళ్లి కుమారుడు స్టెప్పులేస్తుంటే విసుగొచ్చి అతడ్ని చితకబాదారు వధువు కుటుంబీకులు. అతడ్ని పెళ్లి మండపం నుంచి గెంటేశారు. ఈ ఘటన మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలో ఈనెల 22న జరిగింది.

Bridegroom
వరుడు

సింద్ఖేద్రాజా తాలుకాకు చెందిన వరుడికి మల్కాపుర్​ పంగ్రా ప్రాంతానికి చెందిన వధువుతో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 22న మధ్యాహ్నం వధువు స్వస్థలంలోనే వివాహాన్ని జరిపించాలని ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. కానీ తీరా పెళ్లి రోజున వరుడు ట్విస్ట్​ ఇచ్చాడు. మండపం వద్దకు రావడానికి ఆలస్యం చేశాడు.

వివాహ వేదిక వద్దకు అసలే ఆలస్యంగా వచ్చిన మగపెళ్లివారు అక్కడ బరాత్​లో చిందులేయడం మొదలు పెట్టారు. పెళ్లి కొడుకు కూడా వారితో కలిసి స్టెప్పులేశాడు. చివరకు రాత్రి 8 గంటలకు మండపానికి చేరుకున్నాడు. ఆలస్యం అవడంపై వధువు తరపు వారు మగపెళ్లి వారిని ప్రశ్నించడం వల్ల ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో వధువు కుటుంబీకులు పెళ్లికొడుకుపై దాడి చేశారు. అనంతరం వరుడు, అతని కుటుంబసభ్యులను మండపం నుంచి గెంటేశారు. చివరకు స్థానికులు కల్పించుకోవడం వల్ల గొడవ సద్దుమణిగినా.. ఇరు కుటుంబాల వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు.

ఇదీ చూడండి : ముఖ్యమంత్రిపై ఎద్దు దాడి.. లక్కీగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.