ETV Bharat / bharat

Boy Friend On Rent: 'అద్దెకు బాయ్​ఫ్రెండ్'​.. ఎక్కడో తెలుసా? - అద్దెకు బాయ్​ఫ్రెండ్ బిహార్

Boy Friend On Rent Bihar: 'అద్దెకు బాయ్​ఫ్రెండ్​' బిహార్​లోని దర్భంగాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్లకార్డులతో ఓ యువకుడు దర్శనమిస్తున్నాడు. నగరంలోని ప్రతి ప్రాంతంలో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తూ తిరుగుతున్నాడు. మరి ఆ యువకుడు ఎవరు? అతడు ఎందుకు అలా చేస్తున్నాడు..?

boyfriend-on-rent-display-in-darbhanga
అద్దెకు బాయ్​ఫ్రెండ్
author img

By

Published : Feb 12, 2022, 6:01 PM IST

Updated : Feb 12, 2022, 8:33 PM IST

రాజ్​కోట్​ వద్ద ప్లకార్డుతో ప్రియాన్షు

Boy Friend On Rent Bihar: ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు 'వాలెంటైన్స్​ వీక్'ను జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో బిహార్​, దర్భంగాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రియాన్షు మాత్రం 'అద్దెకు బాయ్​ఫ్రెండ్​' అనే ప్లకార్డుతో వీధి వీధి తిరుగుతూ ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ విధంగా ప్రేమ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. నగరంలోని రాజ్​కోట్​, చర్చి, దర్భంగా టవర్​, బిగ్​బజార్​ లాంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తున్నాడు ప్రియాన్షు.

Boy Friend On Rent Bihar
షాపింగ్ మాల్​ దగ్గర అద్దెకు బాయ్​ఫ్రెండ్ ప్లకార్డుతో

దర్భంగా ఇంజినీరింగ్ కాలేజీలో ఐదో సెమిస్టర్ చదువుతున్న ప్రియాన్షు.. అంతకుముందు క్రిస్​మస్ సందర్భంగా.. 'ఫ్రీ హగ్​' పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ ప్రోగ్రాంకు విపరీతమైన ఆదరణ ఏర్పడింది. చాలా మంది నుంచి ప్రశంసలు దక్కాయి.

boyfriend-on-rent-display-in-darbhanga
రాజ్​కోట్​ వద్ద ప్లకార్డుతో ప్రియాన్షు

అందుకే వినూత్న ప్రదర్శన..

తాము ఒంటరిగా ఉన్నామని భావించే వారి ముఖంలో చిరునవ్వు చూడాలని ఇలా ప్లకార్డుతో ప్రదర్శన చేస్తున్నానని 'ఈటీవీ భారత్'​తో చెప్పాడు ప్రియాన్షు. యువత ప్రేమ, ఇతర వ్యవహారాల్లో సమయం వృథా చేయకుండా.. తమ విలువైన సమయాన్ని దేశం కోసం కేటాయించాలన్న ఉద్దేశంతోనే ఇలా వినూత్నంగా ప్రదర్శన చేపట్టినట్లు పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: రైలులో యువతిపై అత్యాచారం- 15 మంది అరెస్ట్​

Last Updated : Feb 12, 2022, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.