ETV Bharat / bharat

యమునా నదిలో పడవ మునక.. 50 మందితో వెళ్తుండగా..!

author img

By

Published : Aug 11, 2022, 5:15 PM IST

Updated : Aug 11, 2022, 8:32 PM IST

BOAT FULL OF FIFTY PEOPLE SINKS IN YAMUNA RIVER IN BANDA

17:10 August 11

యమునా నదిలో పడవ మునక.. 50 మందితో వెళ్తుండగా..!

Boat Sinks Yamuna River: ఉత్తర్​ప్రదేశ్​ బాందా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ మునిగిపోగా.. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 20 మందికిపైగా రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగిస్తామని వివరించారు. మొత్తం బోట్​లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మర్కా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.
మర్కా నుంచి ఫతేపుర్​లో ఉన్న జరౌలీ ఘాట్​కు యమునా నది మీదుగా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బందితో సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Aug 11, 2022, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.