ETV Bharat / bharat

అప్నాదళ్​, నిషాద్​ పార్టీతో భాజపా పొత్తు.. ఆ వర్గాల ఓట్లపైనే ఆశలు! - ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు

BJP alliance in UP: ఎన్​డీఏ భాగస్వామ్యపక్షాలైన అప్నాదళ్​, నిషాద్​ పార్టీతో కలిసే ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది భాజపా. మూడు పార్టీలు కలిసి మొత్తం 403 సీట్లలో పోటీ పడనున్నాయని తెలిపారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

BJP alliance in UP
యూపీలో అప్నాదళ్​, నిషాద్​ పార్టీలతో భాజపా పొత్తు
author img

By

Published : Jan 19, 2022, 6:53 PM IST

BJP alliance in UP: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ భాగస్వామ్యపక్షాలు అప్నాదళ్​, నిషాద్​ పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మూడు పార్టీలు కలిసి మొత్తం 403 సీట్లలో బరిలో నిలవనున్నట్లు చెప్పారు. విస్తృత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

BJP alliance in UP
భాజపా, అప్నాదళ్​, నిషాద్​ పార్టీల నేతలు

" ఎన్​డీఏ భాగస్వామ్య పార్టీలు.. 2019 లోక్​సభ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అప్నాదళ్​, నిషాద్​ పార్టీ, భాజపా కలిసి మొత్తం 403 స్థానాల్లో బరిలో నిలుస్తాయి. కొద్ది రోజులుగా రెండు పార్టీలతో విస్తృత చర్చలు జరిపాం. డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వం ఉత్తర్​ప్రదేశ్​ను అభివృద్ధి పథంలో తీసుకెళుతోంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో వలసలు, రౌడీల ఆగడాలు, కిడ్నాప్​లు తగ్గాయి. మోదీ, యోగి నాయకత్వంలో రాష్ట్రంలో చట్టం తిరిగి ప్రాణం పోసుకుంది. "

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఈ సందర్భంగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు అప్నాదళ్​ అధినేత అనుప్రియా పటేల్​, నిషాద్​ పార్టీ సారథి సంజయ్​ నిషాద్​. ఓబీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. భాజపా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్​డీఏ మరోమారు అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపకంపై త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

సమాజ్​వాదీ పార్టీ నేత, ములాయం సింగ్​ యాదవ్​ కోడలు అపర్ణ యాదవ్​.. భాజపాలో చేరిన రోజునే ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. గత వారం మొదటి, రెండో దశ పోలింగ్​ కోసం.. భాజపా 107 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ గోరఖ్​పుర్​ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్​ మౌర్య.. సిరతు నియోజకవర్గంలో బరిలో నిలుస్తున్నారు.

యూపీ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాలకు ఏడు దశల్లో ఓటింగ్​ జరగనుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో పోలింగ్​ నిర్వహించనున్న ఈసీ.. మార్చి 10న ఫలితాలు వెలువరించనుంది.

ఇదీ చూడండి: మాయావతి 'నామమాత్రపు' పోటీ- మరి దళితుల మద్దతు ఎవరికి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.