బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (Mamata Banerjee).. ఎన్నికల కమిషన్కు(ఈసీ) ఫిర్యాదు చేసింది రాష్ట్ర భాజపా. భవానీపుర్ ఉప ఎన్నిక (Bhabanipur election) ప్రచారంలో ఈసీ విధించిన కొవిడ్ నిబంధనలను సీఎం ఉల్లంఘించారని ఆరోపించింది.
బుధవారం భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలిసి.. భవానీపుర్లోని (Bhabanipur election) ఓ గురుద్వారాను సందర్శించారు మమతా బెనర్జీ. అయితే ఈ సందర్శనలోనే ఆమె కొవిడ్ నిబంధనలు పాటించలేదని అన్నారు భాజపా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సజ్జల్ గోష్.
ఈ నెల 30 జరగనున్న భవానీపుర్ ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి సీఎం మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. మమతకు పోటీగా ప్రియాంక తిబ్రీవాల్ భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
ఈసీకి చేసిన ఫిర్యాదుపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని.. పూర్తిగా రాజకీయ లబ్ధికోసం చేస్తున్న ప్రచారమని బదులిచ్చింది.
ఇదీ చదవండి: Priyanka gandhi up election: ప్రియాంక పోటీ చేస్తే.. ఎక్కడి నుంచి?