బిహార్‌లోని ఖగాడియా జిల్లాలో ప్రేమ, పగలతో కూడిన ఓ వింత వివాహాల ఘటన వెలుగు చూసింది. కొంతకాలం తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించి, చివరకు పెళ్లి చేసుకున్నాడనే పగతో ఆ వ్యక్తి భార్యను వివాహం చేసుకున్నాడు బాధిత భర్త. వినడానికి వింతగా ఉన్నా.. ప్రస్తుతం ఈ వార్త అంతటా చర్చనీయాంశమవుతోంది.
పోలీసులు వివరాలు..
ఖగాడియా జిల్లాలోని హర్దియా గ్రామానికి చెందిన నీరజ్... పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లికి ముందు నీరజ్ భార్య పస్రాహా గ్రామానికి చెందిన ముకేశ్ అనే వ్యక్తితో చనువుగా ఉండేదని.. అది కాస్త ప్రేమగా మారి అనైతిక సంబంధానికి దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. అయితే రూబీ నీరజ్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా ముకేశ్‌తో సంబంధాన్ని అలాగే కొనసాగించింది. ఇకపోతే, అప్పటికే ముకేశ్.. అమ్నీ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కూడా రూబీనే కావడం విశేషం. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే గతేడాది ఫిబ్రవరిలో నీరజ్ భార్య రూబీ దేవి, ముకేశ్లు ఊరు విడిచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నీరజ్.. పోలీస్ స్టేషన్లో ముకేశ్‌పై కిడ్నాప్ కేసు పెట్టాడు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా ముకేశ్ తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితుడు నీరజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన భార్య రూబీ దేవి, ముకేశ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నీరజ్ ఏకంగా ముకేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఈ నెల 18న స్థానిక ఆలయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ఇందులో సరదా విషయమేంటంటే ఇద్దరి భర్తల భార్యల పేర్లు కూడా రూబీనే. ఇకపోతే నీరజ్ ప్రముఖ టాటా కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేశ్ దినసరి కూలీ.
ఆయనకు 21.. ఆమెకు 41
మరోవైపు, 21 వ్యక్తి.. 41 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలియడం వల్ల వాళ్లే దగ్గరుండి మరీ ఇద్దరిని ఒక్కటి చేశారు. ఈ అరుదైన ఘటన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.