Bihar chhapra explosion: బిహార్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలగా.. ఆరుగురు మరణించారు. ఛాప్రాలోని టపాసులు తయారు చేసే కర్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సారణ్ డివిజన్ ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. ఆరు అంబులెన్సులు, సహాయక బృందాలు మోహరించారు.
పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. ఇల్లు నామరూపాలు లేకుండా మారిపోయింది. పైకప్పులు ఎగిరిపోయాయి. గోడలు కూలిపోయాయి. శిథిలాలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మృతుల శరీర బాగాలు 50 మీటర్ల దూరంలో కనిపించాయి. ఇంత భారీ పేలుడు ఎలా జరిగిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు జరిగిన ఇల్లు ఓ మసీదు సమీపంలోనే ఉంది. తొలుత మసీదులోనే పేలుడు జరిగిందని వార్తలు వచ్చాయి. ఘటన అనంతరం స్థానికంగా తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇంటి యజమానిని రియాజుద్దీన్ మియాన్‌గా గుర్తించారు. టపాసులు విక్రయిస్తూ అతడు జీవిస్తుంటాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: