ETV Bharat / bharat

బిహార్​లో భారీ పేలుడు- పది మంది మృతి

bihar-blast
పేలుడు ధాటికి ధ్వంసమైన ఇళ్లు
author img

By

Published : Mar 4, 2022, 6:22 AM IST

Updated : Mar 4, 2022, 1:03 PM IST

06:13 March 04

బిహార్​లో భారీ పేలుడు- పది మంది మృతి

బిహార్​లో భారీ పేలుడు

Bihar blast: బిహార్​ భాగల్​పుర్​ జిల్లాలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా పది మంది మృతి చెందారు. పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తాతార్​పుర్​ పోలీస్​ స్టేషన్ పరిధి, కాజ్వాలీచక్​ ప్రాంతంలోని ఓ ఇంటిలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. సమీపంలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. పేలుడుతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్​, ఎస్​ఎస్​పీ, డీఐజీలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు తెలిపారు. శిథిలాలను తొలగిస్తున్నామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

" ఆ కుటుంబం నాటు బాంబులు, బాణసంచా తయారు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పేలుడు సామగ్రి భారీగా ఉండటం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించినట్లు బావిస్తున్నాం. ఈ పేలుడులో సమీపంలోని 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితల వాంగ్మూలం నమోదు చేస్తున్నాం. 10 మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టం కోసం పంపించాం. బాంబు నిర్వీర్య బృందాలు, ఫోరెన్సిక్​ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పేలుడుకు సంబంధించిన పదార్థాన్ని గుర్తించేందుకు నమూనాలు సేకరించారు. "

- సుబ్రాత్​ కుమార్​ సెన్​, భాగల్​పుర్​ డీఎం.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

బిహార్​ భాగల్​పుర్​ జిల్లాలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​తో మాట్లాడినట్లు ట్వీట్​ చేశారు. బాధితులకు అన్ని రకాల సహయం అదిస్తామని భరోసా ఇచ్చారు.

Last Updated : Mar 4, 2022, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.