ETV Bharat / bharat

గురుగ్రామ్​లో మరో నిర్భయ ఘటన

హరియాణాలోని గురుగ్రామ్​​లో దారుణం జరిగింది. ఓమహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆ యువతిపై కిరాతకంగా దాడిచేశారు. ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్​ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Woman gang-raped, brutally beaten up in Gurgaon; four held
గురుగ్రామ్​లో మరో నిర్భయ ఘటన
author img

By

Published : Oct 5, 2020, 6:29 AM IST

హరియాణాలోని గురుగ్రామ్​లో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. డీఎల్​ఫ్​ ఫేజ్​2 ప్రాంతంలోని ఓ కార్యాలయంలో మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమెను తీవ్రంగా హింసించారు. దీంతో ఆమె తలకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం అత్యాచారం జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు గురుగ్రామ్​​ ఏసీపీ కరన్​ గోయల్​ తెలిపారు. నిందితులందరూ పాతికేళ్లలోపు యువకులేనని పేర్కొన్నారు.

గురుగ్రామ్​లోని సికందర్​పూర్​ మెట్రో స్టేషన్​ సమీపంలో మహిళను కలసిన యువకులు పక్కనే ఉన్న ఓ కార్యాలయంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారాని పాల్పడ్డారు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న కార్యాలయ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించారు.

యూపీలో మరో ఘటన

ఉత్తర్​ప్రదేశ్​లోని భదోహి నగరంలో వివాహిత అయిన 44ఏళ్ల దళిత మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తక్షణమే రంగంలోకి దిగి.. నిందితుల్లో ఇద్దరిని ఆదివారం అరెస్ట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.