కేరళలో కరోనా సోకిన ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంబులెన్స్ డ్రైవర్. పతనంతిట్ట, అరన్ములలోని కొవిడ్ కేర్ సెంటర్ నుంచి చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా 19 ఏళ్ల బాధితురాలిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.
![covid-19 patient was allegedly rapaed by an ambulance driver](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01:26:00:1599378960__06092020102902_0609f_1599368342_904.jpg)
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. కయంకులం గ్రామానికి చెందిన డ్రైవర్ నౌఫల్(29)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 108 అంబులెన్స్ సేవల నుంచి నౌఫల్ను తొలగించారు. దారుణ శారీరక వేధింపులకు గురైన యువతి ప్రస్తుతం అడూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
"ఆసుపత్రి నిర్వహకుల సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. త్వరలో యువతి నుంచి వివరాలు సేకరిస్తాం. ప్రస్తుతం బాధితురాలు జరిగినది వివరించే పరిస్థితిలో లేదు."
-పోలీస్ అధికారి
ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"