తూర్పు లద్దాఖ్‌లో చైనా చొరబాట్ల వ్యవహారంలో కేంద్రంపై మరోమారు విమర్శలు చేసింది కాంగ్రెస్. చైనా అతిక్రమణలు నిజమేనన్న నివేదికలను రక్షణ శాఖ తమ వెబ్సైట్ నుంచి తొలగించటాన్ని తప్పుబట్టింది. వెబ్సైట్ నుంచి పత్రాలను తీసేసినంత మాత్రాన వాస్తవాలు మారవని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
మే నెలలో తూర్పు లద్దాఖ్‌లోని వివిధ ప్రాంతాల్లో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడినట్లు రక్షణ శాఖ అధికారికంగా అంగీకరించింది. జూన్ నెలలో తమ కార్యకలాపాలకు సంబంధించి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన పత్రాల్లో ఈ విషయాన్ని పేర్కొంది. అయితే.. మీడియాలో కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో గురువారం ఆ పత్రాలను తొలగించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.
-
Forget standing up to China, India’s PM lacks the courage even to name them.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Denying China is in our territory and removing documents from websites won’t change the facts.https://t.co/oQuxn77FRs
">Forget standing up to China, India’s PM lacks the courage even to name them.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2020
Denying China is in our territory and removing documents from websites won’t change the facts.https://t.co/oQuxn77FRsForget standing up to China, India’s PM lacks the courage even to name them.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2020
Denying China is in our territory and removing documents from websites won’t change the facts.https://t.co/oQuxn77FRs
" చైనాను ఎదుర్కోవడం కాదు కదా.. కనీసం వారి పేరు చెప్పేందుకు కూడా భారత ప్రధానికి ధైర్యం లేదు. మన భూభాగంలోకి చైనా చొరబడలేదని పదేపదే చెబుతూ.. వెబ్సైట్ నుంచి పత్రాలను తొలగించినంత మాత్రాన వాస్తవాలు మారవు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
నిజాలు చెప్పాలి..
ఆన్లైన్ మీడియా సమావేశం సందర్భంగా చైనా చొరబాట్లపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలని కోరారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్. ఈ విషయంలో పూర్తిస్థాయి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రక్షణ శాఖ తొలగించిన పత్రాల ద్వారా చైనా చొరబాట్లకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. చైనాతో వ్యవహరించటంలో కేంద్రం ఎలాంటి వైఖరిని అవలంబిస్తోందని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: సరిహద్దులో చైనా దురాక్రమణ నిజమే: రక్షణశాఖ