కరోనా వైరస్ పెళ్లిళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పుర్‌లో కేవలం కొవిడ్-19 వల్ల.. పెళ్లికొడుకు లేకుండానే వీడియోకాల్‌లో పెళ్లి జరిపించాల్సి వచ్చింది.
అంటా చౌరాహేకు చెందిన తౌసీఫ్... మారిషస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యే నిగోహి కస్బేకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ నెల 19న వారిద్దరికీ నిఖా జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా మారిషస్ నుంచి భారత్‌కు రావల్సిన విమానాలన్నీ రద్దయ్యాయి.
చేసేదేమీ లేక.. నిశ్చయమైన తేదీనే పెళ్లి జరిపించేందుకు వరుడి కుటుంబ సభ్యులంతా కలిసి, వధువు ఇంటికి చేరుకున్నారు. మతపెద్ద మొదట వధువు పెళ్లికి అంగీకరించినట్టు సంతకం చేయించారు. ఆపై, వీడియో కాల్లో తౌసీఫ్‌తో నిఖా కుబుల్ అనిపించి, పెళ్లి జరిపించేశారు.
"కరోనా కారణంగా మారిషస్‌లో విమానాలు రద్దయ్యాయి. ఇక్కడ వధువు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. బంధువులందరినీ ఆహ్వానించేశారు. అందుకే ఇరుకుటుంబాలు ముందుగా నిశ్చయమైన తేదీకే ఆన్లైన్ వీడియో కాలింగ్ ద్వారా పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. వరుడు తిరిగి ఇంటికి చేరుకోగానే, అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది."
-గుడ్డూ ఖాన్, వరుడి బంధువు
ఇదీ చదవండి:మాస్క్ లేకుండా తుమ్మినందుకు దేహశుద్ధి!