కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది అమెరికా. యూఎస్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) ద్వారా 5.9 మిలియన్ డాలర్లను ఇవ్వనుంది.
కరోనా బాధితులకు చికిత్స, ఇతర సాయం అందించడం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన ప్రచారం చేయడం, కొత్త కేసులు కనుగొనడం, నిఘాను మరింత పటిష్ఠం చేయడం వంటి చర్యలు చేపట్టేందుకు ఈ నిధుల్ని భారత్ ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది అమెరికా విదేశాంగ శాఖ.
గత 20 ఏళ్లలో అమెరికా దాదాపు 2.8 బిలియన్ల డాలర్లను భారత్‌కు సాయం అందించింది. ఇందులో 1.4 బిలియన్ల డాలర్లు వైద్య సాయం కింద ఇచ్చింది.
పాక్‌కు ఐఎంఎఫ్ సాయం..
కరోనా కారణంగా పాకిస్థాన్‌కు అత్యవసర ఆర్థిక సాయం కింద 1.386 బిలియన్ల డాలర్లను సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి గురువారం ఆమోదం తెలిపింది.