లాక్‌డౌన్ అమల్లో రాష్ట్రాలు ఇష్ట ప్రకారం అనుమతులు ఇవ్వడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. ఈనెల 15న జారీచేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు.
-
Union Home Secy Ajay Bhalla, in a letter dated 19 April 2020, has asked Chief Secretaries of all states/UTs drawing their attention to the guideline that state/UTs govts shall not dilute the guidelines under Disaster Mgmt Act, 2005 in any manner & shall strictly enforce the same. pic.twitter.com/gQehWI1XF0
— ANI (@ANI) April 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Union Home Secy Ajay Bhalla, in a letter dated 19 April 2020, has asked Chief Secretaries of all states/UTs drawing their attention to the guideline that state/UTs govts shall not dilute the guidelines under Disaster Mgmt Act, 2005 in any manner & shall strictly enforce the same. pic.twitter.com/gQehWI1XF0
— ANI (@ANI) April 20, 2020Union Home Secy Ajay Bhalla, in a letter dated 19 April 2020, has asked Chief Secretaries of all states/UTs drawing their attention to the guideline that state/UTs govts shall not dilute the guidelines under Disaster Mgmt Act, 2005 in any manner & shall strictly enforce the same. pic.twitter.com/gQehWI1XF0
— ANI (@ANI) April 20, 2020
కేరళ తీరుపై అసహనం!
కేరళ ప్రభుత్వం రెస్టారెంట్లు, పుస్తకాల దుకాణాలు తెరిచేందుకు అంగీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర హోంశాఖ. బస్సులు, ద్విచక్రవాహనాల అనుమతిపైనా అసంతృప్తి వెలిబుచ్చింది. ఇది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. అత్యవసరం కాని సేవలు, కార్యకలాపాలకు పలు రాష్ట్రాలు అనుమతిస్తున్నట్లు సమాచారం వచ్చిందని... తక్షణమే వాటిని నిలిపివేసి కేంద్రం ఆదేశాలను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.
దేశమంతా విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు పాటించాలని నిర్దేశించింది కేంద్రం. విపత్తు వేళ రాష్ట్రాలు అనుసరించాల్సిన వైఖరిపై గతంలో సుప్రీం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం గుర్తుచేసింది. ఎవరికి వారి నిర్ణయాల వల్ల దేశమంతా నష్టపోయే పరిస్థితి రాకూడదని అభిప్రాయపడింది.
కేరళలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 401కి చేరింది. ఇందులో 257 మంది కోలుకున్నారు.ముగ్గురు మృతి చెందారు.
ఇదీ చదవండి...