ETV Bharat / bharat

'మహా'కూటమిలో లుకలుకలు- సీఎంపై కాంగ్రెస్ గుస్సా! - shivsena latest news

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని కాంగ్రెస్​ అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పలు కీలక విషయాలపై చర్చిందేందుకు ఉద్ధవ్​తో వచ్చేవారం సమావేశం కానున్నట్లు వెల్లడించాయి.

Unease in MVA? Cong to meet CM to seek say in decision-making
మహా వికాస్ అఘాడీలో లుకలుకలు? సీఎంపై కాంగ్రెస్ అసహనం!
author img

By

Published : Jun 13, 2020, 5:16 PM IST

శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్​ అఘాడీలో విభేదాలు మొదలయ్యాయా? సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కాంగ్రెస్​ అసంతృప్తితో ఉందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

ప్రభుత్వంలో తమకు క్రియాశీల పాత్ర లేదని కాంగ్రెస్ అసహనంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కీలక నిర్ణయాలు, ముఖ్యమైన సమావేశాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొన్నాయి. ఈ విషయాలపై చర్చించేందుకు ఉద్ధవ్​​తో వచ్చేవారం భేటీ కానున్నట్లు పేర్కొన్నాయి.

'అన్నీ ఆయనతోనే...'

సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​తో మాత్రమే సమావేశం అవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా, నిసర్గ తుపానుతో ప్రభావితమైన వారికి సాయం వంటి అంశాలపైనా ఆయనతోనే చర్చలు జరిపారని గుర్తు చేశాయి. కీలక అంశాలపై చర్చించే సమావేశాల కోసం కాంగ్రెస్​కు ఆహ్వానం అందడంలేదని, ఈ విషయం సహా మరికొన్ని ఇతర ఆంశాల్లో సీఎంపై తాము అసంతృప్తితో ఉన్నట్లు కాంగ్రెస్​ మంత్రి ఒకరు చెప్పారు. వాటిపై చర్చించేందుకే ఆయనతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

గతేడాది నవంబరులో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే పాలనాపరమైన బాధ్యతలను సమానంగా పంచుకోవాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్​ నేత ఒకరు తెలిపారు. గవర్నర్​ కోటాలో శాసన మండలి నామినేషన్లు, కాంగ్రెస్ మంత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్​, పీడబ్ల్యూడీ మంత్రి ఆశోక్ చవాన్​.. ఉద్ధవ్​ ఠాక్రేతో సోమవారం భేటీ అవుతారని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.