ETV Bharat / bharat

ఇక కౌంటర్లలో టికెట్ బుకింగ్​- త్వరలో మరిన్ని రైళ్లు

ఇప్పటివరకు ఆన్​లైన్ బుకింగ్​లు మాత్రమే స్వీకరించిన రైల్వే తాజాగా టికెట్ బుకింగ్ సెంటర్లను ప్రారంభించడానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి 1.7 లక్షల కేంద్రాల్లో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మరిన్ని రైళ్లు ప్రారంభించేందుకు త్వరలోనే ప్రకటన జారీ చేయనున్నట్లు తెలిపారు.

author img

By

Published : May 21, 2020, 4:05 PM IST

Ticket bookings to open at physical facilities across country
ఆఫ్​లైన్లోనూ టికెట్ బుకింగ్​-త్వరలో మరిన్ని రైలు సేవలు

ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగపడేలా.. టికెట్ బుకింగ్ సెంటర్లను తిరిగి ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శుక్రవారం నుంచి 1.7 లక్షల సాధారణ సేవా కేంద్రాల్లో బుకింగ్​లు మొదలవుతాయని స్పష్టం చేశారు.

ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలోనూ రెండు మూడు రోజుల్లో టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు గోయల్. త్వరలోనే మరిన్ని రైలు సేవలు పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

"మనం భారత్​ను సాధారణ స్థితికి తీసుకురావాలి. టికెట్​ కౌంటర్లు ప్రారంభించే అవకాశం ఉన్న రైల్వే స్టేషన్లను గుర్తించే పనిలో ఉన్నాం. టికెట్ బుకింగ్ కోసం ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్త పడాలి. అందువల్ల పరిస్థితిని సమీక్షించి ఇందుకోసం నిబంధనలు రూపొందిస్తున్నాం. మరిన్ని రైళ్లు ప్రారంభించడానికి త్వరలోనే ప్రకటన జారీ చేస్తాం."

-పీయూష్ గోయల్, రైల్వే మంత్రి

మే 1న శ్రామిక్ రైళ్లు ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 2,050 ​రైళ్లు నడిచాయని చెప్పారు గోయల్. శ్రామిక్ రైళ్లు సజావుగా నడిచేందుకు సహకరించిన ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీలను ప్రశంసించారు. సహకారం అందించని పశ్చిమ్ బంగ, ఝార్ఖండ్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

ఐసొలేషన్ బోగీలు

రైల్వే బోగీలను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చే సలహా ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు గోయల్. ఇప్పటివరకు 5 వేల కోచ్​లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చినట్లు తెలిపారు. వీటిని 225 స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలమందికి కరోనా సోకితే భారత్​లో కేవలం లక్ష మందికే వ్యాపించిందని అన్నారు గోయల్. ప్రపంచ జనాభాలో భారతీయులు 17శాతం ఉంటే మొత్తం కరోనా కేసుల్లో 2 శాతం మాత్రమే భారత్​లో నమోదైనట్లు గుర్తు చేశారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మనిర్భర భారత్ ద్వారా భారత్​లో నాణ్యమైన ఉత్పత్తుల తయారీ పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల వ్యాపారాలకు ఊతం లభిస్తుందన్నారు.

ఇదీ చదవండి: రెండు గంటల్లోనే లక్షన్నర టికెట్లు ఉఫ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.