ETV Bharat / bharat

ఈ గ్రామంలోని ఇళ్లు కూతుళ్లకు అంకితం!

హరియాణా నూహ్​ జిల్లాలోని కిరూరి గ్రామం. జాట్​ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతం.. లింగ నిష్పత్తిలో భారీ అంతరానికి పెట్టింది పేరు. ఇప్పుడీ జిల్లా లింగ అసమానతలను తగ్గించేందుకు నడుంకట్టింది. పురుషాధిక్యతకు చెల్లుచీటీ చెబుతూ కూతుళ్లకు పట్టం కడుతోంది. 250 కుటుంబాలతో 1200 జనాభా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు తమ ఇంటి ఆడపడుచుల పేర్లతో ప్రసిద్ధికెక్కింది.

daughters name plates
కూతుళ్ల పేరుతో గ్రామం
author img

By

Published : Oct 18, 2020, 6:48 PM IST

Updated : Dec 14, 2022, 12:26 PM IST

లక్ష్మీ నివాస్, ఆనంది నిలయం, ప్రశాంతి నిలయం ఇలా.. హరియాణా నూహ్ జిల్లాలోని కిరూరి గ్రామంలో ప్రతీ ఇంటి ఎదుట తమ కూతురి పేర్లతో కూడిన బోర్డులు కనిపిస్తాయి. లింగ నిష్పత్తిలో భారీ అంతరం ఉన్న ఈ ప్రాంతంలో.. ప్రగతిశీల ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమానికి నడుం కట్టారు ఇక్కడి ప్రజలు. 250 కుటుంబాలు, 1250 జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందూ తమ కూతుళ్ల పేరుతో ఓ బోర్డు ఏర్పాటై ఉంది.

ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఇదే తొలిసారి కాకపోయినా.. ఇంతటి భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించడం మాత్రం దేశంలో ఇదే మొదటిసారి.

మోదీ ప్రేరణతో!

లాడో స్వాభిమాన్(కుమార్తెల ఆత్మగౌరవ పండుగ) సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వామిత్వ యోజన నుంచి ప్రేరణ పొందిన మాజీ సర్పంచ్ సునీల్ జాగ్లాన్.. ఈ అరుదైన కసరత్తుకు ఆద్యుడయ్యారు. తన కూతురితో కలిసి దిగిన సెల్ఫీతో ప్రధాని మోదీ అభినందనలు అందుకున్నారు జాగ్లాన్.

"స్వామిత్వ పథకంలో భాగంగా ప్రధాని మోదీ యాజమాన్య కార్డులను పంచినప్పుడు మన కూతుళ్లకు కూడా ఓ గుర్తింపు ఉండాలని భావించాను. తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉందన్న విషయాన్ని సమాజం పెద్దగా పరిగణనలోకి తీసుకోదు. కుమార్తె పేరు ద్వారా తండ్రి తన ఇంటికి గుర్తింపు ఇస్తే, సమాజంలోని ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చవచ్చు."

-సునీల్ జాగ్లాన్, మాజీ సర్పంచ్

కూతుళ్ల పేరిట బోర్డు ఏర్పాటుకు కొన్ని కుటుంబాలను ఒప్పంచడం చాలా కష్టమైందని సునీల్ తెలిపారు. మూసధోరణిలో ఉన్న కొంత మంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. తర్వాత పరిస్థితులు మారాయని, క్రమంగా ప్రతీ ఒక్కరు ఇందుకు అంగీకరించారని చెప్పారు.

వారి భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం..

సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రధాని ఆలోచన అయిన 'బేటీ బచావో, బేటీ పడావో'ను అనుసరిస్తున్నట్లు కిరూరి ప్రస్తుత సర్పంచ్ అంజుమ్ అరా పేర్కొన్నారు. తమ కూతుళ్ల భవిష్యత్తు పట్ల ఇక్కడి తల్లితండ్రులు కట్టుబడి ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా దేశానికి తెలుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా తమ గ్రామానికి గుర్తింపు రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూతుళ్ల పేరు మీద బోర్డు ఏర్పాటు చేయడం తమకు సంతోషాన్నిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు ఇందులో భాగస్వామ్యం కావడంపై చిన్నారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Dec 14, 2022, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.