సామాజిక మాధ్యమాలకు బానిసవుతున్న యువత ప్రాణాలనూ లెక్కచేయట్లేదు. సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాంతక విన్యాసాలకు తెగిస్తున్నారు. తాజాగా బిహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.
టిక్‌టాక్‌లో సాహసోపేత వీడియో చేయాలనుకున్న ఓ యువకుడు.. కివూల్- జముయీ స్టేషన్ల మధ్య ఎర్నాకులం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌పైకి ఎక్కాడు. ఇది గమనించిన మానన్పుర్ స్టేషన్ మాస్టర్.. తర్వాత వచ్చే భలుయీ స్టేషన్‌కు సమాచారం అందించారు.
భలుయీలో ఎర్నాకులం రైలును ఆపి.. ఆ యువకుడిని కిందికి దింపినట్లు సమాచారం.
రైలు ఇంజిన్‌పై ఉండే హైవోల్టేజీ వైర్లు అత్యంత ప్రమాదకరం. వాటికి తగిలితే క్షణాల్లో ప్రాణాలను హరిస్తాయి.