ETV Bharat / bharat

అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకుని 7 కి.మీ నడక - lockdown struggles

బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులను ఓర్చుకుంది. కానీ, లాక్​డౌన్​ వేళ పేదరికం పెట్టిన గోసలకు కంటతడి పెట్టుకుంది మహారాష్ట్రకు చెందిన ఓ తల్లి. ప్రసవించిన కొద్ది గంటలకే.. ఒంట్లో నెత్తుటి చుక్క కోసం వెతుకుతూ.. ఎండలో పసికందును ఎత్తుకుని 7 కిలోమీటర్లు నడిచింది.

mh_pal_03_women had to walk for blood with one day newborn child_vis_byte_7204237
అప్పుడే ప్రసవించిన బిడ్డను ఎత్తుకుని.. 7 కి.మీ నడక!
author img

By

Published : Apr 24, 2020, 4:21 PM IST

Updated : Apr 24, 2020, 10:59 PM IST

అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకుని 7 కి.మీ నడక

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్.. పేదల నిస్సహాయతను అడుగడుగునా వెక్కిరిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఉపాధి కోల్పోయి పొట్టకూటికి తిప్పలు పడుతున్న రషీదా.. పురిటి నొప్పులతో రోడ్డెక్కి.. రవాణా సౌకర్యం లేక అవస్థలు పడాల్సొచ్చింది. ప్రసవం తర్వాత ఒంట్లో రక్తం తగ్గి.. రక్తం కోసం నవజాత శిశువును ఒడిలో మోస్తూ.. మండుటెండలో ఏడు కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఏర్పడింది.

నెత్తుటి కష్టాలు...

పాల్ఘడ్ జిల్లా మనోర్​లోని తమ్​సాయి గ్రామానికి చెందిన రషీదా​ ఖతున్​కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. భర్త సద్దాం హుస్సేన్ ఆమెను​ మనోర్​​ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. సహజ ప్రసవంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది రషీదా. ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం జరగడం వల్ల రషీదాకు రక్తం ఎక్కించాల్సొచ్చింది. కానీ, పాల్ఘడ్​లో ఆమెకు కావల్సిన ఓ-నెగెటివ్​ గ్రూపు రక్తం దొరకలేదు. దీంతో అంబులెన్స్​లో ఠాణే జిల్లా ఆసుపత్రికి వెళ్లారు ఆ దంపతులు.

కానీ, అక్కడ ఓ-నెగెటివ్​ రక్తానికి బదులుగా అదే గ్రూపు రక్తం ఇస్తేనే ఆమెకు రక్తమార్పిడి చేస్తామని తేల్చిచెప్పేశారు. వారి దయనీమ పరిస్థితికి జాలిపడకపోగా.. ఫీజు పేరిట రూ.3000/- వసూలు చేశారు ఆ సర్కారు ఆసుపత్రి సిబ్బంది. తిరిగి ఇంటికి వెళ్లిపోదామంటే, రవాణా సౌకర్యం లేదు.

గత్యంతరం లేక బిడ్డను తీసుకుని మండుటెండలో నడక మొదలెట్టారు. నాలుగు కిలోమీటర్లు నడిచాక దారిలో ఓ ఆటోవాలా రూ.3000/- తీసుకుని కొంత దూరం దింపాడు. ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. అందుకే, అక్కడి నుంచి మళ్లీ నడక మొదలెట్టి రాత్రి 10 గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు.

"నాకు ఉదయం తొమ్మిది గంటలకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. మా ఊరి నుంచి ఓ బండిపై కూర్చోని మనోర్​ ఆసుపత్రికి వచ్చాము. ప్రసవం తర్వాత నాకు రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పారు. అందుకు మమ్మల్ని ఠాణేకు పంపించారు. అక్కడా నా గ్రూపు రక్తం దొరకలేదు. ఇంటికి వెళ్దామంటే రవాణా సౌకర్యం లేదు. చేసేదేమీ లేక బిడ్డను తీసుకుని నడక మొదలెట్టాము."

-రషీదా​ ఖతున్, బాధితురాలు

ఇంటికి చేరుకున్నాక.. హుస్సేన్​ కౌలుకు తీసుకున్న పొలం యజమాని వారి దీనస్థితికి చలించిపోయారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి రషీదాకు వైద్యం చేయించారు. ప్రస్తుతం రషీదా ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు వైద్యులు.

Last Updated : Apr 24, 2020, 10:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.