ETV Bharat / bharat

మరోసారి భారీ విధ్వంసానికి ముష్కరుల కుట్ర! - Intelligence Bureau news

దాయాది దేశం అండతో భారత్​లో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాక్​ బలగాలు, ఐఎస్​ఐ, ఉగ్రవాదులంతా ఏకమై కశ్మీర్​కు భారీగా ఆయుధాలు తరలిస్తున్నట్లు హెచ్చరించాయి.

Terrorists are conspiring against India with the Pak Army and ISI military
పాక్​ అండతో భారత్​పై కుట్ర పన్నుతున్న ఉగ్రమూకలు
author img

By

Published : Jul 20, 2020, 2:19 PM IST

భారత్​లో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు పాక్​ అండతో ఉగ్రమూకలు కుయుక్తులు పన్నుతున్నాయని నిఘావర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీచేశాయి. భారీ సంఖ్యలో ముష్కరులను దేశంలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

గురేజ్, కంజల్వాన్ నుంచి దేశంలోకి చొరబడేందుకు 13 మంది ఉగ్రవాదులు ప్రయత్నం చేయవచ్చని తెలిపాయి నిఘావర్గాలు. వీరిలో 8 మంది లష్కరే తోయిబా సభ్యులు ఉన్నట్లు వెల్లడించాయి. నౌషెరా సమీపంలో పాక్ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లో శిబిరాల వద్ద 18 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు కూడా తెలిపిన నిఘావర్గాలు.. ఉరీలో ప్రవేశించేందుకు మూడు బృందాలు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించాయి.

పాక్​ ఆర్మీతో జతకట్టి..

ముష్కరులకు అందించేందుకు డ్రోన్​లు, ఇతర వ్యవస్థల ద్వారా కశ్మీర్​లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాయి. ఇందుకోసం పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాదులు ఏకమై ముష్కరులను సమీకరిస్తున్నట్లు వివరించాయి. ఆయుధాల పంపిణీకి పీఓకే వద్ద అల్బదర్-తాలిబన్ కమాండర్ హమీద్​ఖాన్​ రే.. భారీ డంప్ ఏర్పాటు చేసినట్లు నిఘా అధికారులు హెచ్చరించారు.

కుట్ర భగ్నం..

ఉగ్రవాదులు భారత్​లోకి చొరబడేందుకు వీలుగా దాయాది సైన్యం.. పదే పదే సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆదివారం కూడా రావి నది ద్వారా రూ. 250 కోట్ల విలువైన 60 కిలోల హెరాయిన్​ను భారత్​కు పంపేందుకు పాక్​ చేసిన కుట్రను బీఎస్​ఎప్​ జవాన్లు భగ్నం చేశారు.

ఇదీ చదవండి: డిసెంబరు కల్లా కొవిడ్​-19 వ్యాక్సిన్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.