దక్షిణ కశ్మీర్ అవంతిపోరాలోని భేగ్పొరాలో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకోను మట్టుబెట్టింది సైన్యం. సుదీర్ఘంగా జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఆ ఉగ్రవాదిని హతమార్చింది.
కశ్మీర్ ఎన్కౌంటర్లో హిజ్బుల్ టాప్ కమాండర్ రియాజ్ హతం - Encounter
A terrorist was killed during a gun battle with Jammu and Kahmir police and security forces at Sharshali Khrew area of Awantipora on Wednesday.
14:31 May 06
13:49 May 06
భేగ్పొరా ప్రాంతంలో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది సైన్యం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
13:14 May 06
కశ్మీర్ అవంతిపొరాలోని షార్షాలీ క్రూలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
11:46 May 06
మరో ఉగ్రవాది హతం..
జమ్ముకశ్మీర్ భేగ్పొరా ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది సైన్యం. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
11:33 May 06
దక్షిణ కశ్మీర్ భేగ్పొరాలో జరుగుతున్న ఎన్కౌంటర్లో హిజ్బుల్ ఉగ్ర సంస్థ టాప్ కమాండర్ రియాజ్ నైకోను.. సైన్యం చుట్టుముట్టింది. ఇతడితో పాటు మరో ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య కొద్ది గంటల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఈ ప్రాంతంలో ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది.
11:16 May 06
జమ్ముకశ్మీర్ భేగ్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ చిక్కుకున్నట్లు సైనికవర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.
సాతురా ప్రాంతంలో మరో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాది వద్దనున్న ఆయుధ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
09:27 May 06
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్ అవంతిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. షార్షాలీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో.. నిర్బంధ తనిఖీలు చేపట్టిన సైన్యం.. ఓ ముష్కరుడ్ని హతమార్చింది. అతడి వద్ద నుంచి ఏకే-56 రైఫిల్‌ను స్వాధీనం చేసుకుంది.
అనంతరం.. భేగ్పొరా ప్రాంతంలోనూ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బృందం లక్ష్యంగా చేసుకుందని, ఆపరేషన్‌లో పురోగతి కనిపిస్తోందని జమ్ముకశ్మీర్ పోలీస్ విభాగం వెల్లడించింది. సమీపంలోని 12 నుంచి 15 కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఓ ఉగ్రవాద టాప్ కమాండర్‌ను సైన్యం చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.