జమ్ముకశ్మీర్ బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. వారి రహస్య స్థావరాన్ని ఛేదించి.. రూ. 4 లక్షల నగదు, భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
"ఈ ముగ్గురూ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రసంస్థ అగ్రనేతలతో సన్నిహితంగా ఉన్నారు. బందిపొరా, కుప్వారా జిల్లాల్లో ఉగ్రదాడులు చేయడానికిగానూ రూ.14 లక్షలు వీరికి అందాయి. ఇలాంటి దాడుల కోసం మొత్తం రూ.90 లక్షలు పీఓకేలోని ఉగ్రనేతలు పంపిణీ చేశారు."
- పోలీసులు
ఇదీ చూడండి: 'ఆ వార్తలు అవాస్తవం.. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది