ETV Bharat / bharat

ఆన్​లైన్​ తరగతుల కోసం కొండలెక్కాల్సిందే! - online education kerala

కరోనా పరిస్థితుల నడుమ ఆన్‌లైన్​లోనే‌ తరగతులు నిర్వహిస్తోంది కేరళ ప్రభుత్వం. దీని వల్ల అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు ఇంటర్నెట్​ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్​లో సిగ్నల్​ కోసం రోజూ ఎండలో కొండలు ఎక్కుతున్నారు.

taking online classes becomes uphill task for children in keralas mattupetty
ఆన్​లైన్​ తరగతుల కోసం కొండలెక్కాల్సిందే!
author img

By

Published : Oct 19, 2020, 8:39 AM IST

సుమతి ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి. కరోనా కంటే ముందు తను పొద్దున్నే పాఠశాలకు తయారై వెళ్లేది. కానీ, ఇప్పుడు రోజూ ఉదయాన్నే వాళ్ల నాన్న ఫోన్​ పట్టుకుని సిగ్నల్​ కోసం వెతుక్కుంటూ తిరుగుతోంది ఆ విద్యార్థిని. ఇదంతా ఆన్​లైన్​ తరగతుల వల్ల వచ్చిన మార్పు.

సుమతిది మాత్రమే కాదు.. కేరళ ఇడుక్కి జిల్లా మున్నార్​లోని మట్టుపెట్టి విద్యార్థులందరి పరిస్థితి ఇంతే. ఓ చేత్తో పుస్తకాలను, మరో చేత్తో ఫోన్​ పట్టుకుని సిగ్నల్ కోసం రోజూ కొండలను ఎక్కుతున్నారు.

"మేము స్టడీ మెటీరియల్స్​ను డౌన్​లోడ్​ చేసుకోలేకపోతున్నాం. సిగ్నల్​ కోసం కొండలను ఎక్కి, ఆన్​లైన్​ తరగతులకు హాజరవుతున్నాం."

--సుమతి, ఎనిమిదో తరగతి విద్యార్థిని

" మేమంతా ఇలా ఎండలో కొండలెక్కి చదువుకోవడానికి వస్తున్నాం. ఒకవేళ వర్షం పడితే ఇక మేము తరగతులకు హాజరవ్వలేం."

-- కీర్తన, ఆరో తరగతి విద్యార్థిని

మట్టుపెట్టి పాఠశాల పరిధిలోని దోబాయపాలెం, కుట్టియార్​ ప్రాంతాల్లో 130 పైచిలుకు కుటుంబాలు నివసిస్తున్నాయి. వారంతా నెట్​వర్క్​ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

"మేమంతా ఇక్కడి తేయాకు తోటలపై ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఫోన్​ కొనడమే చాలా కష్టం. కానీ, మేము ఎలాగొలా.. ఫోన్​ తెచ్చుకున్నప్పటికీ మా పిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు."

-- ఓ విద్యార్థి తండ్రి.

taking online classes becomes uphill task for children in keralas mattupetty
కొండలెక్కి ఆన్​లైన్​ పాఠాలు వింటున్న విద్యార్థులు

సిగ్నల్​ ఉందా.. పోయిందా?

సిగ్నల్​ వచ్చేదెలా..? పాఠం వినేదెలా?

తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు. ఇప్పటికైనా స్పందించి పిల్లల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:గుడ్డు కూర పెట్టలేదని మిత్రుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.