మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య దేవేంద్ర ఫడణవీస్ సర్కార్ ఏర్పాటుకు అనుమతిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టత ఇవ్వనుంది. ఆయన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని శనివారం ఆశ్రయించగా....ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం.
దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో చెప్పే లేఖలను సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని పరిశీలించాకే తదుపరి ఉత్తర్వులు జారీచేస్తామని జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న స్పష్టం చేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది. ఫడణవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్న వాదన సహా పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలనూ పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ముచ్చటగా మూడోసారి..
ఈ ఏడాది పలు కీలక సందర్భాల్లో సెలవురోజుల్లో ప్రత్యేక ప్రొసీడింగ్‌లను నిర్వహించింది సుప్రీంకోర్టు.
- మహారాష్ట్రలో ఫడణవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన-ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సెలవురోజైన ఆదివారం విచారణ చేపట్టింది.
- అయోధ్య కేసు విషయంలో ప్రత్యేకంగా సమావేశమై తీర్పు వెలువరించిన నవంబరు 9వ తేదీ(శనివారం) సెలవు రోజే.
- ఏప్రిల్ 20న(శనివారం) అప్పటి ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగొయిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును విచారించింది సర్వోన్నత న్యాయస్థానం
ఇదీ చూడండి: 'రామమందిరాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు'