ETV Bharat / bharat

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు

author img

By

Published : Apr 16, 2020, 4:55 AM IST

Updated : Apr 16, 2020, 8:23 AM IST

దేశంలో పొడిగించిన లాక్​డౌన్​పై నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. ఇందులో పేర్కొన్న  ప్రకారం పొగాకు, గుట్కా, మద్యం అమ్మకాలపై పూర్తి స్థాయి నిషేధం విధించింది. బహిరంగంగా ఉమ్మటాన్ని నిషేధించిన కేంద్రం.. ఉల్లంఘించిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.

LOCKDOWN-GUIDELINES-SPITTING
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు

దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో కొన్ని అంశాలను సడలించిన ప్రభుత్వం.. మరికొన్ని నిబంధనలను మాత్రం మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

బయటకు వస్తే తప్పకుండా మాస్కులు వినియోగించాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మటంపై నిషేధం విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. జరిమానా నుంచి హత్యాయత్నం కేసు వరకు పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పింది.

వైద్యుల సూచనలు..

నోటి నుంచి వచ్చే బిందువుల వల్ల వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్లనే భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గుట్కా, పాన్​ నమిలి ఉమ్మటం వల్ల బిందువులు ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో..

ఉత్తర్​ప్రదేశ్​లో ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పాన్​ మసాలాపై పూర్తిగా నిషేధం విధించింది యోగి ప్రభుత్వం. తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, హరియాణా, నాగాలాండ్, అసోం కూడా ఈ దారిలోనే నడిచాయి. పొగాకు ఉత్పత్తుల విక్రయం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మటాన్ని నిషేధించాయి.

ఫలించని చర్యలు..

గతంలోనూ చాలా మునిసిపాలిటీలు పొగాకు, పాన్​ నమిలి ఉమ్మటాన్ని నిషేధించాయి. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ కూడా బహిరంగంగా ఉమ్మివేస్తే రూ.1,000 జరిమానా విధిస్తున్నారు. దిల్లీలోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు.

అయినప్పటికీ కార్యాలయాల్లో మెట్లు, గోడల మీద పాన్, పొగాకు మరకలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిబంధనలు ప్రజల్లో ఏ మాత్రం మార్పు తీసుకొస్తాయనే దానిపై ప్రముఖంగా చర్చ జరుగుతుంది.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మటంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. దీనితోపాటు గుట్కా, పొగాకు ఉత్పత్తులు, మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయండి'

Last Updated : Apr 16, 2020, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.