కర్ణాటకలోని రెండు వేర్వేరు వన్యప్రాణి అభయారణ్యాలలో 40 రోజుల వ్యవధిలో 6 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఇందులో 4 కావేరి అభయారణ్యంలో , మిగిలిన 2 మహదేశ్వరలో మరణించాయి.
వేర్వేరు కారణాలతో...
కర్ణాటక హనూరు తాలుకా దంతల్లిలో విద్యుదాఘాతంతో ఓ ఏనుగు మరణించింది. కందల్లిలో గర్భంతో ఉన్న మరో ఏనుగు బరువును తట్టుకోలేక గుంతలో పడింది. ఇంకొకటి బండరాయిని ఢీకొని ప్రాణాలు విడిచింది.
కొన్ని రోజుల క్రితం కావేరి అభయారణ్యంలో రెండు ఏనుగుల కళేబరాలు లభ్యమయ్యాయి. మహదేశ్వరలో మరొకటి దొరికింది. ఇలా 40 రోజుల కాలంలో ఆరు ఏనుగులు మృతిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఒడిశాలో 3 రోజులుగా కరోనా కేసులు '0'