ETV Bharat / bharat

నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరిపై విచారిస్తాం: సుప్రీం - Supreme court news nirbhaya

నిర్భయ కేసులో దోషులను ఒకేసారి ఉరితీయాలన్న దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్​ చేస్తూ.. కేంద్రం, దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే.. ఈ పిటిషన్​ను ఈనెల 23న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

SC to examine if death-row convicts in same case can be hanged separately
నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరిపై విచారిస్తాం: సుప్రీం
author img

By

Published : Mar 5, 2020, 11:10 PM IST

Updated : Mar 5, 2020, 11:54 PM IST

నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరిపై విచారిస్తామన్న సుప్రీం న్యాయస్థానం

ఒకే కేసుకు సంబంధించి ఒకరికంటే ఎక్కువ మందికి ఉరిశిక్ష పడి ఉంటే.. వారిని వేర్వేరుగా ఉరి తీసేందుకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను పరిశీలిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు. నిర్భయ దోషులందరికీ ఒకేసారి ఉరిశిక్ష వేయాలని ఫిబ్రవరి 5న దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. కేంద్రంతో పాటు దిల్లీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

తాజాగా ఈనెల 20న నిర్భయ దోషులకు డెత్​ వారెంట్​ ఇచ్చింది దిల్లీ కోర్టు. అయితే కేంద్రం, దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై ఈ నెల 23న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

'దోషులను వేర్వేరుగా ఉరి తీయొచ్చా లేక అందరికీ ఒకేసారి మరణశిక్ష అమలు చేయాలా? అన్నదే ఇక్కడ ప్రశ్న. దీనిని మేము పరిశీలిస్తాం.'

- సుప్రీంకోర్టు

ఇదీ చదవండి: ప్రధాని నరేంద్రమోదీ రక్షణకు అమెరికాతో భారీ ఒప్పందం ​

Last Updated : Mar 5, 2020, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.