సివిల్స్-2020 పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్పై కేంద్రం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) స్పందన కోరింది సుప్రీం కోర్టు. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం.. కేంద్రం, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది.
కరోనా మహమ్మారి ప్రభావం సహా వర్షాలు, వరదల కారణంగా సివిల్స్ పరీక్షల్ని రెండు లేదా మూడు నెలల పాటు వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు.
షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 4న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.