ETV Bharat / bharat

'30 ఏళ్ల కృషితో రామాలయ కల సాకారం' - అయోధ్య మోహన్ భగవత్ ప్రసంగం

రామమందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, వారంతా భూమిపూజ కార్యక్రమానికి రాలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్​ భగవత్. రథయాత్ర సారథి ఎల్​కే అడ్వాణీ కరోనా సంక్షోభం కారణంగా హాజరుకాలేకపోయారని తెలిపారు. ఆర్​ఎస్​ఎస్​, ఇతర సంస్థలు చేసిన 30 ఏళ్ల కృషితో రామమందిర సమస్య పరిష్కారమైందని వ్యాఖ్యానించారు.

rss chief
ఆర్​ఎస్​ఎస్
author img

By

Published : Aug 5, 2020, 1:59 PM IST

రామమందిర నిర్మాణానికి అంకురార్పణతో దేశమంతా ఆనందం వెల్లివిరిసిందని ఆర్​ఎస్​ఎస్​ సారథి మోహన్ భగవత్ అన్నారు. భూమిపూజ అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ఆయన.. నవ భారత నిర్మాణానికి ఇది పునాది అని పేర్కొన్నారు.

"రామమందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. కరోనా కారణంగా వారందరూ ఇక్కడకు రాలేకపోయారు. ఎల్​కే అడ్వాణీ తన ఇంటి నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. రామమందిరం కోసం 30 ఏళ్లు కష్టపడాల్సి ఉంటుందని గతంలో బాలాసాహెబ్ దేవరాజ్ నాతో చెప్పారు. అప్పుడే మన కల సాకారమవుతుందన్నారు.

ఇప్పుడు ఆయన చెప్పిందే జరిగింది. ఆర్​ఎస్​ఎస్​, ఇతర సంస్థలు చేసిన 30 ఏళ్ల కృషితో రామమందిర సమస్య పరిష్కారమైంది. ఈ రోజు దేశమంతా ఆనందం వెల్లివిరుస్తోంది. రామమందిరాన్ని భౌతికంగానే కాదు.. మన మనసులోనూ నిర్మించుకోవాలి."

- మోహన్ భగవత్, ఆర్​ఎస్​ఎస్ చీఫ్

మోదీ నాయకత్వంలో..

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ చారిత్రక ఘట్టం సాధ్యమైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. మోదీ ముందుచూపు, కృషితో రామమందిరానికి శాంతియుత పరిష్కారం లభించిందని ప్రశంసించారు. రామమందిర నిర్మాణానికి దేశ ప్రజలు 500 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య విలువల శక్తి, దాని న్యాయవ్యవస్థ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎలా పరిష్కరించగలదో... అయోధ్య అంశం ప్రపంచానికి తెలియచెప్పిందన్నారు యోగి.

ఇదీ చూడండి: 'వారి త్యాగాలు విస్మరించిన వారు 'రామ ద్రోహులు''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.