ETV Bharat / bharat

లాక్​డౌన్ ఆంక్షల నడుమ 'ఈద్​'​ వేడుకలు - ramjan

దేశవ్యాప్తంగా నేడు ఈద్​​ వేడుకలు ప్రారంభమయ్యాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు ముస్లింలు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకుంటున్నారు. మరోవైపు కేరళ, జమ్ముకశ్మీర్​ల్లో ఆదివారమే ఈద్​ వేడుకలు నిర్వహించారు.

Ramadan celebrations amidst lockdown sanctions
లాక్​డౌన్ ఆంక్షల నడుమ రంజాన్​ వేడుకలు
author img

By

Published : May 25, 2020, 6:16 AM IST

లాక్​డౌన్​ నడుమ దేశవ్యాప్తంగా నేడు రంజాన్​ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముస్లింలంతా ఆంక్షలను పాటిస్తూ.. ఇళ్ల వద్దే ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.

మరోవైపు కేరళ, జమ్ము కశ్మీర్​ల్లో ఆదివారమే ఈద్​ వేడుకలు జరిగాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో మతపరమైన సమావేశాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ఈద్​ పర్వదినాన వేల సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొనే మసీదులు.. మొదటిసారి ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు...

రంజాన్​ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. వేడుకలు జరుపుకోవాలని సూచించారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాంకాక్షలు తెలియజేస్తూ.. కరోనా నుంచి కాపాడుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.