ETV Bharat / bharat

'జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్​ వాహనాలు లేవు.. మోదీకి మాత్రం'

author img

By

Published : Oct 11, 2020, 8:54 AM IST

జవాన్లను నాన్​ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో పంపడాన్ని తప్పుపడుతూ కేంద్రంపై ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. సైనికులకు బుల్లెట్ ప్రూఫ్​ వాహనాలు ఏర్పాటు చేయలేని ప్రభుత్వం రూ. 8400 కోట్లతో ప్రధాని కోసం ఖరీదైన విమానాన్ని కొనుగోలు చేసిందని మండిపడ్డారు. ఇదేం న్యాయం? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Rahul Gandhi attacks Centre over non-bullet proof vehicles for soldiers
'జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్​ వాహనాలు లేవు.. మోదీకి మాత్రం'

వీవీఐపీ విమానాల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశం కోసం సరిహద్దులో ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల కోసం బుల్లెట్​ ప్రూఫ్ వాహనాలు కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వం.. ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఏకంగా రూ.8400 కోట్లతో విమానాన్ని కొనుగోలు చేయడమేంటని మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం? అని ట్విట్టర్ వేదికగా శనివారం ప్రశ్నించారు రాహుల్​.

" మన జవాన్లు అమరులయ్యేందుకు వారిని నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కులలో పంపిస్తున్నారు. మరోవైపు రూ. 8400 కోట్లతో ప్రధాని కోసం ఖరీదైన విమానం కొనుగోలు చేశారు. ఇది న్యాయమేనా?"

-రాహుల్ గాంధీ ట్వీట్

బుల్లెట్ ప్రూఫ్ వాహనాల విషయంపై సైనికుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను ట్వీట్​కు జత చేశారు రాహుల్ గాంధీ. సీనియర్​ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించి తమకు మాత్రం నాన్​బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఏర్పాటు చేయడంపై కొందరు జవాన్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంభాషణ ఆ వీడియోలో ఉంది. తమ జీవితానికి సంబంధించిన విషయాలతో అధికారులు రాజీ పడుతున్నారని కొందరు సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'విమానాలు తప్ప సైనికులను మోదీ పట్టించుకోరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.