ETV Bharat / bharat

'పెట్టుబడిదారీ మిత్రుల కోసమే వ్యవసాయ బిల్లులు'

author img

By

Published : Sep 22, 2020, 5:52 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. రైతుల ప్రయోజనాలను హరించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడుతోంది. పార్టీ అగ్రనేత రాహుల్​, సీనియర్​ నేత చిదంబరం వరుస ట్వీట్లతో కేంద్రంపై ధ్వజమెత్తారు.

Rahul accuses govt of working for development of crony capitalists
'బిల్లుల'పై స్వరం పెంచిన కాంగ్రెస్

నూతన వ్యవసాయ బిల్లులను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్​.. మంగళవారం స్వరం పెంచింది. నూతన బిల్లుల సాయంతో ప్రధాని మోదీ తన పెట్టుబడిదారీ మిత్రుల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారని పార్టీ అగ్రనేత రాహుల్​గాంధీ మండిపడ్డారు. ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు​.

  • 2014- मोदी जी का चुनावी वादा किसानों को स्वामीनाथन कमिशन वाला MSP

    2015- मोदी सरकार ने कोर्ट में कहा कि उनसे ये न हो पाएगा

    2020- काले किसान क़ानून

    मोदी जी की नीयत ‘साफ़’
    कृषि-विरोधी नया प्रयास
    किसानों को करके जड़ से साफ़
    पूँजीपति ‘मित्रों’ का ख़ूब विकास।

    — Rahul Gandhi (@RahulGandhi) September 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"2014 ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సూచించిన ఎంఎస్​పీని అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. 2015లో అది అమలు చేయలేమని కోర్టుకు చెప్పారు. 2020లో వ్యవసాయ రంగానికి కళంకంగా మారిన నూతన బిల్లులను తెచ్చారు. "

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

బిల్లుల్లో పొందుపర్చిన కొన్ని అంశాలను కాంగ్రెస్​ సీనియర్ నేత​ చిదంబరం ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు. బిల్లులను సమర్థిస్తూ 'వన్ నేషన్-వన్ మార్కెట్' తమ ఉద్దేశం అని కేంద్రం చేసిన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

" దేశంలో 85శాతం మంది రైతులు చిన్న, సన్నకారు కమతాలు ఉన్నవారు. వారికి పండిన వరి, గోధుమలు, కందులు ఇలా పలు రకాల కొద్దిపాటి పంటలను అమ్ముకోవడానికి ఒక మార్కెట్​ ఎలా సరిపోతుంది. వేల మార్కెట్లు అవసరం అవుతాయి."

-చిదంబరం, కాంగ్రెస్​ సీనియర్​ నేత

రెండు కోట్లమంది రైతుల సంతకాలు

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్​. బిల్లులను ఆమోదించవద్దని రెండు కోట్ల మంది రైతులు సంతకాలు చేసిన మెమోరండాన్ని రాష్ట్రపతి కోవింద్​కు అందజేశారు నాయకులు.

భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భౌతికంగా సమావేశం అయ్యారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్ళులు, రాష్ట్రాల ఇన్​ఛార్జులు. దేశంలో కరోనా ప్రబలిన తర్వాత ప్రధాన కార్యాలయంలో భౌతిక సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.