ETV Bharat / bharat

భారత గడ్డపై రఫేల్-​ అంబాలా చేరిన శత్రు భీకర జెట్స్ - భారత్​కు చేరుకున్న రఫేల్

ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న రఫేల్​ విమానాలు భారత అమ్ములపొదిలో చేరాయి. సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 5 రఫేల్ జెట్లు బుధవారం మధ్యాహ్నం అంబాలా వైమానిక స్థావరంలో కాలుమోపాయి.

rafael
రఫేల్
author img

By

Published : Jul 29, 2020, 3:14 PM IST

భారత్​ ఎంతగానో ఎదురుచూస్తోన్న రఫేల్ యుద్ధవిమానాలు అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. తొలుత భారత్​ గగనతలంలోకి ప్రవేశించిన రఫేల్​ విమానాలకు రెండు సుఖోయ్​- 30 ఎంకేఐ విమానాలతో స్వాగతం పలికింది రక్షణ శాఖ. వాటి వెన్నంటే ఉండి అంబాలాకు చేరుకున్నాయి రఫేల్ సూపర్​జెట్లు.

భారత వైమానిక దళ అమ్ముల పొదిలోకి చేరేందుకు రఫేల్​ విమానాలు సోమవారమే ప్రయాణం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరం మెరినాక్‌ వైమానికి స్థావరం నుంచి బయలుదేరిన ఐదు జెట్‌లు పది గంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లోని ఆల్‌ ధాఫ్రా వైమానికి స్థావరంలో దిగి అక్కడి నుంచి అంబాలాకు వచ్చాయి.

మొత్తం ఏడు వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో రఫేల్‌ జెట్‌లు గాలిలోనే ఇంధనాన్ని నింపుకోగా.. అందుకోసం ఫ్రాన్స్‌ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్‌ విమానాన్ని ఏర్పాటు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.