ETV Bharat / bharat

ప్రశాంత్ కిశోర్​ ఎల్​జేపీ కోసం పని చేస్తున్నారా?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​.. తమ పార్టీకి మద్దతుగా లేరని లోక్​జన​శక్తి పార్టీ(ఎల్​జేపీ) అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ స్పష్టం చేశారు. ఎల్​జేపీ మద్దతుగా ప్రశాంత్... ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారని వదంతలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు చిరాగ్​.

Prashant Kishor is not backing LJP, Chirag Paswan clarifies after rumours
'ప్రశాంత్ కిషోర్​ ఎల్​జేపీకి మద్దతుగా లేరు'
author img

By

Published : Oct 21, 2020, 2:25 PM IST

లోక్​జనశక్తి పార్టీ(ఎల్​జేపీ)కి మద్దతుగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ ఉన్నట్లు వస్తున్న వదంతులను ఖండించారు చిరాగ్​ పాసవాన్. తమ పార్టీకి ఎవరు మద్దతుగా లేరని స్పష్టం చేశారు చిరాగ్​. '20ఏళ్లనాటి తమ పార్టీకి ఎవరి సాయం లేకుండా గెలిచే సామర్థ్యం ఉంది' అని చిరాగ్ అన్నారు.​

"ప్రశాంత్ కిషోర్​ నాకు మద్దతు ఇస్తున్నారని, నేను పార్టీలో బీ బృందం అని వారు(విపక్షలు) పుకార్లు వ్యాప్తి చేస్తున్నాయి. రామ్​విలాస్​​ పాసవాన్​ జీ 51 ఏళ్ల కళంకం లేని రాజకీయ జీవితంలో ఎల్​జేపీ 20ఏళ్ల పార్టీ అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నాకు ఒకరి మద్దతు ఎందుకు అవసరం? ఎల్​జేపీకి సొంత వ్యూహాలు ఉన్నాయి. మేము ఎన్నికల్లో విజయం సాధిస్తాం. అందుకే భయపడుతున్న ముఖ్యమంత్రి వదంతలు వ్యాప్తి చేస్తున్నారు."

- చిరాగ్​ పాసవాన్​, ఎల్​జేపీ అధ్యక్షుడు

'ఎన్నికల తర్వాత ఆర్​జేడీ కూటమిలో ఎల్​జేపీ చేరుతుందని కొంతమంది భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత కూటమి మారినట్లు పార్టీ చరిత్రలోనే లేదు. అందుకే ముందే ప్రధాని మోదీ అభిప్రాయాలు నచ్చే.. ఎన్​డీఏ కూటమి పొత్తు కుదుర్చుకున్నాం' అని చిరాగ్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: కాంగ్రెస్​, ఎల్​జేపీల మేనిఫెస్టోలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.