ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగాల్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవానికి హాజరు కానున్నారు మోదీ. ఈ నేపథ్యంలో విమానాశ్రయం నుంచే ఆయనకు నిరసనలు ఎదురయ్యాయి. వందల మంది రోడ్లపైకి వచ్చి మోదీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
ఆందోళనల మధ్య
కోల్‌కతాకు మోదీ రాక సందర్భంగా విమానాశ్రయం వద్ద పెద్దసంఖ్యలో నిరసనకారులు గుమిగూడారు. మోదీని కోల్‌కతా నగరంలోకి అడుగుపెట్టనివ్వబోమని నినాదాలు చేశారు. జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయం, గోల్పార్క్, కళాశాల వీధి, హతిభాగన్, ఎస్ప్లనేడ్ వద్ద ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఎన్ఆర్సీ, పౌరచట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
"బంగాల్ ప్రజలను విభజించే మోదీ, అమిత్‌షా సహా ఇతర భాజపా నేతల పర్యటనలకు మేం వ్యతిరేకం."
-ఎస్ఎఫ్ఐ సంస్థ
ఇదీ చూడండి: విక్రమాదిత్య రన్‌వే పై స్వదేశీ 'లైట్ కంబాట్'