దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. వారి ఒత్తిడిని తగ్గించేందుకు మొబైల్ కాలింగ్, డేటా, టీవీ సర్వీసులు ఉచితంగా అందించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మనోహర్ ప్రతాప్ అనే వ్యక్తి ఈ పిల్‌ను దాఖలు చేశారు.
ఇవి కూడా..
మొబైల్, టీవీ సర్వీసులతో పాటు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్లు కూడా ఉచితంగా నిరంతరాయంగా అందించాలని పిటిషన్లో పేర్కొన్నారు. లాక్డౌన్ ఉన్నంత కాలం ఇలా ఉచిత సేవలు అందించేలా ఆయా సంస్థలను ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ఇదీ చూడండి: కరోనాపై 'అమ్మ, నాన్న, ఓ ఏడేళ్ల అమ్మాయి' పోరు