కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అయితే కొందరు భయం లేకుండా రోడ్లపై ఇష్టారీతిన తిరుగుతున్నారు. వారి చేత పోలీసులు గుంజీలు తీయిస్తున్నారు. మరికొందరు లాఠీలతో కొడుతున్నారు. కానీ దిల్లీ పోలీసులు మాత్రం.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి చేత 'కరోనా రోగి' మృతదేహాన్ని మోయిస్తున్నారు.
ఏం జరిగిందంటే...
దిల్లీలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ కొందరు రోడ్లపై వాహనాలతో తిరుగుతున్నారు. వీరికి బుద్ధిచెప్పడానికి పోలీసులు ఓ ప్రణాళిక రచించారు.
మండవాలీ పోలీస్ స్టేషన్‌కు పరిధిలో.. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొందరిని పట్టుకున్నారు. అనంతరం కరోనా బాధితుడి మృతదేహాన్ని మోయమన్నారు. దీంతో భయపడి.. ఆ వ్యక్తులు తమ వాహనంలో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంటనే పట్టుకున్నారు. చివరికి కాళ్లలో వణుకుతోనే కరోనా రోగి మృతదేహాన్ని మోశారు.
అయితే అది కరోనా బాధితుడి మృతదేహం కాదు. ఆ స్ట్రెచర్‌పై ఉన్నది.. పీపీఈ కిట్ ధరించిన ఓ ఆరోగ్యవంతమైన పోలీసు.
ఇదీ చూడండి:- హాస్పిటల్ కిటికీ ఎక్కి కూర్చుంది.. ఎంతకూ దిగిరానంది!