ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్‌కు భారత్‌లో మంగళవారం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌పై పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ప్రయోగాలు నిర్వహించనుంది.
కొవిషీల్డ్ భద్రత, దాని రోగ నిరోధక శక్తిని నిర్ణయించేందుకు పుణెలోని భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల ఆసుపత్రి ఈ పరీక్షలకు వేదికైంది. ఆక్స్‌ఫర్డ్ అభివృద్ది చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఎస్‌ఐఐ.. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
'ఆత్మనిర్భర్' భారత్‌గా..
"మన దేశప్రజలకు అనుగుణంగా మేము ప్రపంచస్థాయి కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచబోతున్నాం. అలాగే మన దేశాన్ని 'ఆత్మనిర్భర్'గా మార్చనున్నాం." అని ఎస్‌ఐఐకి చెందిన ఉన్నతాధికారి ప్రకాశ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
16 వందల మందిపై..
దేశవ్యాప్తంగా మొత్తం 17 ప్రాంతాల్లో.. 18 సంవత్సరాల వయసు పైబడిన 1600 మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించనున్నట్లు ఎస్‌ఐఐ వర్గాలు వెల్లడించాయి. మనుషుల మీద రెండు, మూడో దశ ప్రయోగాలు నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆగస్టు 3న ఎస్‌ఐఐకి అనుమతినిచ్చింది.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ల రేసులో ప్రపంచ దేశాల పరుగు.!