భారత సైనిక బృందమే లక్ష్యంగా పాక్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్ముకశ్మీర్‌లోని బారముల్లా జిల్లా నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగపడినట్లు భారత సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో 40 ఏళ్ల మహిళ మృతిచెందగా.. మరో స్త్రీకి గాయాలయ్యాయి.
అలాగే పాక్ సైనికులు శుక్రవారం ఉదయం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. రాంపుర్ సెక్టార్లో మోర్టార్లు, ఇతర ఆయుధాలను ప్రయోగించినట్లు భారత సైన్యం తెలిపింది.
ఇదీ చదవండి: బ్రహ్మోస్ ఆదాయం అంతా క్షిపణి అభివృద్ధికే!