జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. అవంతిపొరాలోని షార్షాలిలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముందే పసిగట్టిన ముష్కరులు వారిపై కాల్పులు జరిగారు. ఇది ఎన్కౌంటర్కు దారితీసింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది భారత సైన్యం. ముష్కరుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్ అవంతిపొరాలోని షార్షాలీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడిని హతమార్చింది సైన్యం.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్