ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటివరకు రూ.17,500 కోట్ల వ్యయంతో 1.4 కోట్ల మందికిపైగా పేదలకు నగదు రహిత వైద్య సేవలు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ పథకం కింద 24,653 ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి ఆసుపత్రిలో నిమిషానికి సగటున 14 ప్రవేశాలు నమోదు అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధాన ఆరోగ్య పరిరక్షణ మిషన్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం) అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడానికి జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థను సందర్శించారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు.
ఇదీ చూడండి: 'బ్లాక్ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయండి'