ETV Bharat / bharat

ఎలుక తెచ్చిన తంట.. జైలుకెళ్లిన వ్యక్తి! - Chandigarh today news

ఎలుక కారణంగా ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. బోనులో చిక్కిన ఎలుకను కాపాడే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కాడు. లాక్​డౌన్​ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అసలేం జరిగిందంటే..

Chandigarh resident lands in lock-up
ఎలుక తెచ్చిన తంట... జైలుకెళ్లిన వ్యక్తి!
author img

By

Published : May 3, 2020, 6:08 AM IST

బోనులో చిక్కిన ఎలుక ప్రాణాలు రక్షించినందుకు ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. బోనులో నుంచి బయట పడేసి ఇంట్లోకి తిరిగి వస్తుండగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. లాక్​డౌన్​ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది...

ఛండీగఢ్‌లోని 23వ సెక్టర్‌ నివాసి అజయ్‌ కుమార్‌. ఎలుక బెడద కారణంగా ఇంట్లో బోనును వాడుతుండేవాడు. అలా ఓ రోజు బోనులో ఎలుక చిక్కింది. దాన్ని దగ్గరిలోని పార్కులో పడేసేందుకు బయటికి వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అటుగా వెళుతున్న గస్తీ పోలీసుల కంటపడ్డాడు అజయ్​.

ఇంకేముంది.. బయటికి వచ్చినందుకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అజయ్​ తన పరిస్థితిని వివరిస్తున్నా.. లాక్​డౌన్​ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం 17వ సెక్టార్‌ ఠాణాకు తరలించారు. చివరికి బెయిల్‌పై విడుదలయ్యాడు అజయ్‌.

ఇదీ చదవండి: అందని ప్రభుత్వ సాయం.. గుర్రపు డెక్కే ఆహారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.