ETV Bharat / bharat

పాకిస్థాన్​ కాల్పులు- ఎస్సై సహా ముగ్గురు జవాన్లు వీరమరణం - దీటుగా సమాధానమిచ్చిన భారత జవాన్లు

ceasefire violation
పాకిస్థాన్​ కాల్పులు
author img

By

Published : Nov 13, 2020, 4:59 PM IST

Updated : Nov 13, 2020, 6:57 PM IST

17:57 November 13

సరిహద్దుల్లో పాక్​ కవ్వింపు చర్యలు.. భారత్​ దీటైన జవాబు

దేశమంతా దీపావళి వేడుకలకు సిద్ధం అవుతున్న వేళ దాయాదిదేశం పాకిస్థాన్‌ తన కపట బుద్ధిని బయటపెట్టింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట అనేక చోట్ల కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంట వేర్వేరు సెక్టార్లలో పాకిస్థాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మోర్టార్లు, తుపాకులతో విరుచుకుపడింది. పాకిస్థాన్‌ కాల్పుల్లో హాజీపీర్‌ సెక్టార్‌లో ఓ బీఎస్​ఎఫ్​ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అమరుడు కాగా, మరో జవాన్‌ గాయపడ్డారు. ఉరిలోని నాంబ్లా సెక్టార్‌లో కూడా పాకిస్థాన్‌ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు.

కమల్‌కోట్‌ సెక్టార్‌లో సైతం పాకిస్థాన్‌ తుపాకులకు పని చెప్పింది. పాక్‌ కాల్పుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాల్‌కోట్‌ ప్రాంతంలో మరో మహిళ చనిపోయారు. నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్‌ కవ్వింపు చర్యల్లో పలువురు సైనికులు, పౌరులు గాయపడ్డారు.

భారత దళాల దీటైన జవాబు..

పాకిస్థాన్‌ సైన్యం కవ్వింపు చర్యలకు భారత దళాలు రెట్టింపు స్థాయిలో బదులిచ్చాయి. ఉత్తర కశ్మీర్‌లో పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన బంకర్లు, ఆయుధ, చమురు డిపోలను ధ్వంసం చేశాయి. పాక్‌ బంకర్లు ధ్వంసమైన ప్రాంతంలో ఆ దేశ జాతీయ పతాకం స్పష్టంగా కనిపించింది. భారత సైన్యం ప్రతి దాడిలో ఏడు నుంచి 8మంది పాక్‌ సైనికులు హతమయ్యారు.

చొరబాటు కట్ర భగ్నం..

కవ్వింపు చర్యల మాటునే పాకిస్థాన్‌ సైన్యం చొరబాట్లకు కూడా కుట్రపన్నింది. కేరన్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించగా.. అప్రమత్తమైన భారత దళాలు ఆ కుట్రను భగ్నం చేశాయి.

'సరిహద్దుల వద్ద పాకిస్థాన్‌ తన దురాగతాలను కొనసాగిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల వద్ద జరిగిన వేర్వేరు కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనల్లో ఓ బీఎస్​ఎఫ్​ ఇన్‌స్పెక్టర్‌ సహా మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లాలో బీఎస్​ఎఫ్​ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్‌ దోవల్ అమరులయ్యారు. ఆయన స్వస్ధలం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌. ఇదే ఘటనలో మరో జవాన్‌ గాయపడ్డారు. జవాన్‌ పరిస్ధితి నిలకడగానే ఉంది.   కమల్‌కోట్‌లోని నియంత్రణ రేఖ వద్ద జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. పూంచ్‌ సెక్టార్‌లో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. ఇజ్‌మార్గ్‌, గురేజ్‌, కేరన్‌ సెక్టార్లలోనూ పాకిస్థాన్​ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి దిగింది. కేరన్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే, దాని మాటున ఉగ్రవాదుల చొరబాటు యత్నం జరిగింది. అప్రమత్తమైన భారత దళాలు చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టాయి.' అని  రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా తెలిపారు.

ఈ ఏడాదిలో 4,052 సార్లు కాల్పులు

సరిహద్దుల్లో పాకిస్థాన్​ ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 4.052 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దుశ్చర్యలకు పాల్పడింది. అందులో అక్టోబర్​లో 394, నవంబర్​లో 13 రోజుల్లోనే 128 సార్లు కవ్వింపులకు పాల్పడింది. గత ఏడాది ఈ సంఖ్య 3,233గా ఉంది.  

17:04 November 13

  • పాక్ రేంజర్ల కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్న భారత జవాన్లు
  • భారత జవాన్ల కాల్పుల్లో 12 మంది పాక్ సైనికులకు గాయాలు
  • గాయపడిన పాక్ సైనికుల్లో కొందరు చనిపోయినట్లు సమాచారం

16:53 November 13

సరిహద్దులో కొనసాగుతున్న పాకిస్థాన్​ దురాగతం

  • జమ్ముకశ్మీర్‌: సరిహద్దుల్లో కొనసాగుతున్న పాకిస్థాన్​ దురాఘాతం
  • జమ్ముకశ్మీర్‌: ఎల్‌వోసీ వెంబడి 4 చోట్ల పాకిస్థాన్ బలగాల కాల్పులు
  • పాక్‌ రేంజర్లు, ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, మరో ముగ్గురు పౌరులు మృతి
  • జమ్ముకశ్మీర్‌: యురి, హీజీపీర్‌ సెక్టార్లలో పాకిస్థాన్‌ బలగాల కాల్పులు
  • కమల్‌కోట్, బాలాకోట్‌ ప్రాంతాల్లో పాకిస్థాన్‌ బలగాల కాల్పులు
  • జమ్ముకశ్మీర్‌: పాక్‌ రేంజర్లు, ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరుగురు మృతి 
  • జమ్ముకశ్మీర్‌: రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి 
  • యురి సెక్టార్‌లో ఇద్దరు జవాన్లు, గురెజ్‌ సెక్టార్‌లో మరో జవాను మృతి 
  • యురి సెక్టార్‌లో పాక్‌ రేంజర్ల కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి 

Last Updated : Nov 13, 2020, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.