ప్రపంచ పర్యటక దినోత్సవ సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరి తీరంలో ఏర్పాటు చేసిన ఈ సైకత కళాఖండంతో అద్వితీయమైన సందేశమిచ్చారు. కరోనా నేపథ్యంలో పర్యటకాన్ని ఆస్వాదిస్తూనే నిబంధనలు పాటించాలని కోరారు.
![Odisha's sudarshan pattnaik creates sand Art to promote World tourism](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-pur-01-puri-tourismday-avo-7205521_27092020085412_2709f_1601177052_223.jpg)
ప్రపంచంలోని అద్భుత వింతలతో పాటు ప్రముఖ సందర్శనీయ ప్రదేశాలను సైకత శిల్పంపై ఏర్పాటు చేశారు సుదర్శన్ పట్నాయక్. తాజ్ మహల్, ఈఫిల్ టవర్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, పీసా టవర్ సహా ప్రఖ్యాత కట్టడాలను ఇసుకతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు.
![Odisha's sudarshan pattnaik creates sand Art to promote World tourism](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-pur-01-puri-tourismday-avo-7205521_27092020085412_2709f_1601177052_45.jpg)