భారత్‌లో కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 415కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఆదివారం రాత్రి(360) నుంచి ఇప్పటి వరకు కేసుల సంఖ్య పెరిగిన తీరు ఆందోళన కలిగిస్తోంది.
వైరస్ సోకినవారిలో 41మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. కరోనా కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించారని ప్రకటించింది. 24 మంది పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేసింది.
సోమవారం ఉదయం 10గంటలవరకు 18వేల 383 నమూనాలను పరీక్షించినట్టు తెలిపంది భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది.
విలవలలాడుతున్నాయి
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం వల్ల మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. మహరాష్ట్రలో 80కుపైగా కేసులు నమోదయ్యాయి.
దిల్లీ(29), యూపీ(28),రాజస్థాన్(27)తెలంగాణా(26),కర్ణాటక(26)లోనూ కరోనా వ్యాప్తిచెందుతోంది. హరియాణా, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బంగా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ కేసులు నమోదవుతున్నాయి.
ఇదీ చూడండి : లాక్‌డౌన్‌ను లెక్కచేయని ప్రజలు- మార్కెట్లు రద్దీ