ETV Bharat / bharat

రూ.600తో 20 నిమిషాల్లోపే కరోనా పరీక్ష ఫలితాలు - రాజీవ్ గాంధీ జీవసాంకేతిక సంస్థ

తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షలు నిర్వహించేలా భారత శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. 20 నిమిషాల్లోపే ఫలితం వెల్లడించే కరోనా టెస్టింగ్ కిట్లను కేరళలోని రాజీవ్ గాంధీ జీవసాంకేతిక సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నిపుణుల అవసరం లేకుండానే పరీక్ష నిర్వహించగలిగే ఈ కిట్ల తయారీ కోసం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్​) అనుమతులు కోరినట్లు అధికారులు తెలిపారు.

Rajiv Gandhi Centre for Biotechnology
రూ.600తో 20 నిమిషాల్లోపే కరోనా పరీక్ష ఫలితాలు
author img

By

Published : Apr 17, 2020, 9:03 PM IST

కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించే విధంగా కిట్ల తయారీకి భారత శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్వరమే కరోనా పరీక్షలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు కేరళలోని రాజీవ్ గాంధీ జీవసాంకేతిక సంస్థ శాస్త్రవేత్తలు. తక్కువ ఖర్చుతో, సులభంగా పరీక్షలు నిర్వహించేలా కరోనా యాంటీబాడీ టెస్టింగ్ కిట్ (ఆర్​జీఐబీ)​ను రూపొందించారు.

ప్రస్తుతం పరీక్ష విధానంలోని పరిమితులన్నీ ఈ ఆర్​జీసీబీ కిట్ల ద్వారా అధిగమించవచ్చు. నిపుణులు అవసరం లేకుండానే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని అధికారులు చెబుతున్నారు. కొద్దిపాటి శిక్షణతో ఆశావర్కర్లు, వాలంటీర్ల ద్వారా కూడా ఈ పరీక్షలు చేయించవచ్చని స్పష్టం చేశారు. కేవలం 20 నిమిషాల్లోపే ఈ పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. భారత్​లో ఒకవేళ కమ్యూనిటీ వ్యాప్తి సంభవిస్తే ఇలాంటి కిట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్నో ప్రత్యేకతలు

  • ఈ టెస్టింగ్​ కిట్​కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నమూనా ఫలితాలను ఈ కిట్ కేవలం 5 నిమిషాల్లోనే రాబడుతుంది. 15 నిమిషాలలో పూర్తి సమాచారం వెల్లడిస్తుంది.
  • దీని తయారీకి రూ.400 ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కాగా దీని వెల గరిష్ఠంగా రూ.600కి మించకుండా ఉండే విధంగా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
  • ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉండటం వల్ల ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలైన బస్టాండ్​లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించవచ్చు.
  • ఈ కిట్ ద్వారా నిపుణుల అవసరం లేకుండానే పరీక్షలు నిర్వహించవచ్చు.
  • సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద వీటిని నిల్వ చేయవచ్చు. దీని కాలపరిమితి ఒక సంవత్సరం.

నెలకు 70 లక్షల కిట్లు

ఈ కిట్ల తయారీకి ప్రైవేటు జీవసాంకేతిక సంస్థ 'యూ-బయో'తో కలిసి పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నెలకు 70 లక్షల కిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉన్నట్లు తెలిపారు. వీటిని ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు.

దీన్ని భారీ ఎత్తున వినియోగంలోకి తీసుకొచ్చేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)​ అనుమతులు కోరినట్లు ఆర్​జీఐబీ అధికారులు తెలిపారు. వారం రోజుల్లోగా తుది అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.